Lord Shiva

శ్రీ కాల హస్తీశ్వర శతకమ్(తెలుగు)

(Shri Kalahastishwara Shatakam in Telugu)

Dhurjati

Shri Kalahastishwara Shatakam is a profound devotional work composed by the 16th-century poet Dhurjati, one of the Ashta-diggajas in the court of Krishnadevaraya. The poem is addressed to Lord Shiva residing in the famous Kalahasti temple. Through one hundred verses, the poet expresses intense devotion, philosophical detachment from worldly life, and personal repentance. It is considered a masterpiece of Telugu literature, renowned for its rich metaphorical language. Reciting these verses is believed to help seekers overcome ego, foster deep spiritual introspection, and attain the grace of Lord Shiva, leading to liberation from the cycle of rebirth.

శ్రీవిద్యుత్కలితాఽజవఞ్జవమహా-జీమూతపాపామ్బుధా-
రావేగమ్బున మన్మనోబ్జసముదీ-ర్ణత్వమ్బుఁ గోల్పోయితిన్ ।
దేవా! మీ కరుణాశరత్సమయమిన్-తేఁ జాలుఁ జిద్భావనా-
సేవం దామరతమ్పరై మనియెదన్- శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 1 ॥
వాణీవల్లభదుర్లభమ్బగు భవద్ద్వారమ్బున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క
ల్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 2 ॥
అన్తా మిధ్య తలఞ్చి చూచిన నరుం డట్లౌ టెఱిఙ్గిన్ సదా
కాన్త ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కమ్బఞ్చు మోహార్ణవ
చిభ్రాన్తిం జెన్ది జరిఞ్చు గాని పరమార్ధమ్బైన నీయన్దుఁ దాఁ
జిన్తాకన్తయు జిన్త నిల్పఁడుగదా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 3 ॥
నీ నా సన్దొడఁబాటుమాట వినుమా నీచేత జీతమ్బు నేఁ
గానిం బట్టక సన్తతమ్బు మది వేడ్కం గొల్తు నన్తస్సప
త్నానీకమ్బున కొప్పగిమ్పకుము నన్నాపాటీయే చాలుఁ దే
జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 4 ॥
భవకేలీమదిరామదమ్బున మహా పాపాత్ముఁడై వీడు న
న్ను వివేకిమ్పఁ డటఞ్చు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు; బాలుణ్డొకచోట నాటతమితోడ న్నూతఁ గూలఙ్గఁ దం
డ్రి విచారిమ్పక యుణ్డునా కటకటా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 5 ॥
స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వమ్బోతినో కాక నే
నీమాట న్విననొల్లకుణ్డితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో
యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ
చీ మధ్యమ్బున ముఞ్చి యుమ్పదగునా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 6 ॥
దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా
నువు నీ విల్లు నిధీశ్వరుణ్డు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకుఁ డిఙ్క నీకెన ఘనుణ్డుం గల్గునే నీవు చూ
చి విచారిమ్పవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 7 ॥
నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుఞ్జేయగలేను నీకొఱకు దణ్డ్రిఞ్జమ్పగాఁజాల నా
చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుఞ్జీకాకు నాభక్తి యే
రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 8 ॥
ఆలుమ్బిడ్డలు దల్లిదణ్డ్రులు ధనమ్బఞ్చు న్మహాబన్ధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేలఁ జిన్తిన్తు ని
ర్మూలమ్బైన మనమ్బులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుఙ్కి యీ
శీలామాలపు జిన్త నెట్లుడిపెదో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 9 ॥
నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నన్తక భుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పున్దారును ముక్తు లౌదు రవి శాస్త్రమ్బుల్మహాపణ్డితుల్
చెప్పఙ్గా దమకిఙ్క శఙ్క వలెనా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 10 ॥
వీడెమ్బబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుమ్బొట్టలోఁ
గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడఙ్గ వినునప్పుడున్ జెలఁగు దమ్భప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 11 ॥
నిను సేవిమ్పగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుణ్డననీ మహాత్ము డననీ సంసారమోహమ్బు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గున్దిమ్పనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 12 ॥
ఏ వేదమ్బు బఠిఞ్చె లూత భుజఙ్గం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనమ్బొనర్చెఁ గరి చెఞ్చేమన్త్ర మూహిఞ్చె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియె కాక జన్తుతతికిన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 13 ॥
కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయమ్బు వక్షోజముల్
రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాన్తిచే
బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ
జేయఞ్జాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 14 ॥
నిన్నేరూపముగా భజిన్తు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుఞ్చము మేకపెణ్టికయొ యీ సన్దేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారమ్బుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 15 ॥
నిను నావాఁకిలి గావుమణ్టినొ మరున్నీలాకాభ్రాన్తిఁ గుం
టెన పొమ్మణ్టినొ యెఙ్గిలిచ్చి తిను తిణ్టేఁగాని కాదణ్టినో
నిను నెమ్మిన్దగ విశ్వసిఞ్చుసుజనానీకమ్బు రక్షిమ్పఁజే
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 16 ॥
ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ఞ్చునేఁ
జాలన్ జమ్పఙ్గ నేత్రము న్దివియఙ్గాశక్తుణ్డనేఁ గాను నా
శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తమ్బు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాఙ్ఘ్రియుగలా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 17 ॥
రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయమ్బు వారిచ్చునం
భోజాక్షీచతురన్తయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజమ్బుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొన్దితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 18 ॥
నీరూపమ్బు దలమ్పఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో
రారా రమ్మని యఞ్చుఁ జెప్పవు పృధారమ్భమ్బు లిఙ్కేటికిన్!
నీర న్ముమ్పుము పాల ముమ్పు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగలా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 19 ॥
నీకు న్మాంసము వాఞ్ఛయేని కఱవా నీచేత లేడుణ్డఁగాఁ
జోకైనట్టి కుఠారముణ్డ ననల జ్యోతుణ్డ నీరుణ్డఁగా
బాకం బొప్ప ఘటిఞ్చి చేతిపునుకన్ భక్షిమ్పకాబోయచేఁ
జేకొం టెఙ్గిలిమాంసమిట్లు దగునా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 20 ॥
రాజై దుష్కృతిఁ జెన్దెఁ జన్దురుణ్డు రారాజై కుబేరుణ్డు దృ
గ్రాజీవమ్బునఁ గాఞ్చె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్తబన్ధువులతో నా రాజశబ్ధమ్బు చీ
ఛీ జన్మాన్తరమన్దు నొల్లనుజుమీ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 21 ॥
రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మమ్బుణ్డు నేరీతి నా
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాలికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజమ్బుల్ భజియిన్తు రేతెఱఁగునన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 22 ॥
తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దమ్బుల్ మరుద్దీపముల్
కరికర్ణాన్తము లెణ్డమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరమ్బు లసువుల్ జ్యోత్స్నాపఃపిణ్డముల్
సిరులన్దేల మదాన్ధులౌదురు జనుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 23 ॥
నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నలమ్ములు తల్లిదణ్డ్రులు గురున్దాపత్సహాయున్దు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదామ్భోధి దాటిఞ్చి య
ఛ్చిన్నానన్దసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 24 ॥
నీ పఞ్చం బడియుణ్డగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవిమ్ప్ఁగానోప నా
శాపాశమ్బులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బణ్టుగాఁ
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 25 ॥
నీ పేరున్ భవదఙ్ఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తామ్బూలమున్
నీ పల్లెమ్బు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న
న్నీపాటిం గరుణిమ్పు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ
జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 26 ॥
అమ్మా యయ్య యటఞ్చు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిఁ దల్లిదణ్డ్రులనటఞ్చు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియుఁ దణ్డ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం
జిమ్మఞ్జీకణ్టి గప్పిన న్గడవు నన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 27 ॥
కొడుకుల్ పుట్ట రటఞ్చు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాన్తులై
కొడుకుల్ పుట్టరె కౌరవేన్ద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 28 ॥
గ్రహదోషమ్బులు దుర్నిమిత్తములు నీకల్యాణనామమ్బు ప్ర
త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధమ్బెట్టగానోపునే?
దహనుం గప్పఙ్గఞ్జాలునే శలభసన్తానమ్బు నీ సేవఁ జే
సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 29 ॥
అడుగమ్మోనిక నన్యమార్గరతులమ్బ్రాణావనోత్సాహినై
యడుగమ్బోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజిమ్పఙ్గాఁగనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దిఙ్కేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 30 ॥
మదమాతఙ్గము లన్దలమ్బుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమలమ్బు ల్మోక్షమీఁజాలునే?
మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశమ్బుఁ గా
చి దినమ్బుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 31 ॥
రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యమ్బులన్
పాసీ పాయరు పుత్రమిత్రజన సమ్పద్భ్రాన్తి వాఞ్ఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుల్లణపవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 32 ॥
ఎన్నేల్లున్దు నేమి గన్దు నిఁకనేనెవ్వారి రక్షిఞ్చెదన్
నిన్నే నిష్ఠ భజిఞ్చెద న్నిరుపమోన్నిద్రప్రమోదమ్బు నా
కెన్నణ్డబ్బెడు న్న్తకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం?
జిన్నమ్బుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 33 ॥
చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలిమ్పఁగా లేక న
న్నెవైద్యుణ్డు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమన్దు రక్షిఞ్చునో
ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నిన్తైనఁ జిన్తిమ్పఁడా
జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 34 ॥
దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
ననమధ్యోపల వేదికాగ్రమున నానన్దమ్బునం బఙ్కజా
నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యమ్బు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖమ్బు లగునే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 35 ॥
ఆలఞ్చు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పిఞ్చి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సమ్బన్ధమ్బు గావిఞ్చి యా
మాలర్మమ్బున బాన్ధవం బనెడి ప్రేమం గొన్దఱం ద్రిప్పఁగాఁ
సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 36 ॥
తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మిమ్పకుం
డ నుపాయమ్బు ఘటిమ్పు మాగతుల రెణ్ట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యమ్బున్న సంసేవఁ జే
సి నినుం గాఞ్చెదఁగాక కాలముననో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 37 ॥
పదునాల్గేలె మహాయుగమ్బు లొక భూపాలుణ్డు; చెల్లిఞ్చె న
య్యుదయాస్తాచలసన్ధి నాజ్ఞ నొకఁ డాయుష్మన్తుణ్డై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మఞ్చు నక్కటకటా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 38 ॥
రాజన్నన్తనె పోవునా కృపయు ధర్మమ్బాభిజాత్యమ్బు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యమ్బు కృతమ్బెఱుఙ్గటయు విశ్వాసమ్బు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గాఁ గతమ్బు గలదే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 39 ॥
మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకమ్బు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చిన్తిఞ్చి చూడఙ్గ నె
ట్లనినం గీటఫణీన్ద్రపోతమదవే దణ్డోగ్రహింసావిచా
రిని గాఙ్గాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 40 ॥
పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మమ్బు నా-
టవికత్వమ్బుఁ ప్రియమ్బులై భుగహశుణ్డాలాతవీచారులన్
భవదుఃఖమ్బులఁ బాపు టొప్పుఁ జెలఁదిమ్బాటిఞ్చి కైవల్యమి-
చ్చి వినోదిఞ్చుట కేమి కారణమయా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 41 ॥
అమరస్త్రీల రమిఞ్చినం జెడదు మోహం బిన్తయున్ బ్రహ్మప-
ట్టము సిధ్ధిఞ్చిన నాస దీఱదు నిరూఢక్రోధమున్ సర్వలో-
కముల న్మ్రిఙ్గిన మాన దిన్దుఁ గల సౌ-ఖ్యం బొల్ల నీసేవఁ జే-
సి మహాపాతకవారిరాశిఁ గడతున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 42 ॥
చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యమ్బుగా వత్తు మే
మనుమానమ్బిఁక లేదు నమ్మమని తారావేల నారేవునన్
మునుఁగమ్బోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ
జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 43 ॥
భవదుఃఖమ్బులు రాజకీటముల నేబ్రార్ధిఞ్చినం బాయునే
భవదఙ్ఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచణ్టన్దల్లి కారుణ్యద్బ
ష్థివిశేషమ్బున నిచ్చి చణ్టఁబలె నో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 44 ॥
పవి పుష్పమ్బగు నగ్ని మఞ్చగు నకూపారమ్బు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమణ్డలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 45 ॥
లేవో కానలఁ గన్ధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొన్ది భూపాలురన్
సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 46 ॥
మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహమ్బుచే నన్దుఁజే
సిన కర్మమ్బుల ప్రోవు లెన్ని గలవో చిన్తిఞ్చినన్ గాన నీ
జననమ్బే యని యున్న వాడ నిదియే చాలిమ్పవే నిన్నుఁ గొ
ల్చిన పుణ్యమ్బునకుం గృపారతుఁడవై శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 47 ॥
తను వెన్దాక ధరిత్రి నుణ్డు నను నన్దాకన్ మహారోగదీ
పనదుఃఖాదులఁ బొన్దకుణ్డ ననుకమ్పాదృష్టి వీక్షిఞ్చి యా
వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపఞ్చమ్బుఁ బా
సిన చిత్తమ్బున నుణ్డఁజేయఙ్గదవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 48 ॥
మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మమ్బులు షట్కఞ్జమ్బులో మోము దా
జలజమ్బో నిటలమ్బు చన్ద్రకలయో సఙ్గమ్బు యోగమ్బొ గా
సిలి సేవిన్తురు కాన్తలన్ భువి జనుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 49 ॥
జలకమ్బుల్ రసముల్ ప్రసూనములు వాచాబన్ధముల్ వాద్యము
ల్కలశబ్ధధ్వను లఞ్చితామ్బర మలఙ్కారమ్బు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 50 ॥
ఏలీల న్నుతియిమ్పవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యఙ్గ్యశ
బ్ధాలఙ్కారవిశేషభాషల కలభ్యమ్బైన నీరూపముం
జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యమ్బు వర్ణిఞ్చుచో
చీ! లజ్జిమ్పరుగాక మాదృశకవుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 51 ॥
పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరణ్టిపణ్డ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలిమ్పరే తల్లిదణ్డ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనమ్బులం గుడుపరా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 52 ॥
కలలఞ్చున్ శకునమ్బులఞ్చు గ్రహయోగం బఞ్చు సాముద్రికం
బు లటఞ్చుం దెవులఞ్చు దిష్ట్మనుచున్ భూతమ్బులఞ్చు న్విషా
దులటఞ్చు న్నిమిషార్ధ జీవనములఞ్చుం బ్రీతిఁ బుట్టిఞ్చి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 53 ॥
తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానమ్బుపై భూతియున్
గలసీమమ్బున దణ్డ నాసికతుదన్ గన్ధప్రసారమ్బు లో
పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుణ్డు నీకెప్పుడుం
జెలికాడై విహరిఞ్చు రౌప్యగిరిపై శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 54 ॥
ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధమ్బు లీనేర్తురే
వేల న్వారి భజిమ్పఁ జాలిపడ కావిర్భూత మోదమ్బునం
గాలమ్బెల్ల సుఖమ్బు నీకు నిఁక భక్తశ్రేణి రక్షిమ్పకే
శ్రీలెవ్వారికిఁ గూడమ్బెట్టెదవయా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 55 ॥
సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేల న
న్నలన్తలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయఞ్జాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టమ్బునిధిలోఁ గాపుణ్డు టబ్జమ్బు పైఁ
జెలువొప్పున్ సుఖియిమ్పఁ గాఞ్చుట సుమీ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 56 ॥
కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగన్ధర్వమున్ బున్కయుం
బులితోలు న్భసితమ్బుఁ బాఁపతొదవుల్ పోకుణ్డఁ దోఁబుట్లకై
తొలి నేవారలతోడఁ బుట్టక కలాదుల్గల్గె మేలయ్యెనా
సిలువులూరముచేసికొం టెఱిఙ్గియే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 57 ॥
శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధిఞ్చి తత్త్వమ్బులన్
మతి నూహిఞ్చి శరీర మస్థిరము బ్రహ్మమ్బెన్న సత్యమ్బు గాం
చితి మఞ్చున్ సభలన్ వృధావచనము ల్చెప్పఙ్గనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 58 ॥
గతి నీవఞ్చు భజిఞ్చువార లపవర్గం బొన్దగానేల సం
తతముం గూటికినై చరిమ్ప వినలేదా 'యాయు రన్నం ప్రయ
చ్ఛతి' యఞ్చున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాన్ధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానమ్బడవో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 59 ॥
రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో
నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బామ్బోతునుం దాఁకి యు
గ్రతఁ బోరాడఙ్గనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 60 ॥
అన్తా సంశయమే శరీరఘటనమ్బన్తా విచారమ్బె లో
నన్తా దుఃఖపరమ్పరానివితమె మేనన్తా భయభ్రాన్తమే
యన్తానన్తశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జిన్తన్ నిన్నుఁ దలఞ్చి పొన్దరు నరుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 61 ॥
సన్తోషిఞ్చితినిఁ జాలుఞ్జాలు రతిరాజద్వారసౌఖ్యమ్బులన్
శాన్తిన్ బొన్దితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యమ్బులన్
శాన్తిం బొన్దెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యమ్బు ని
శ్చిన్తన్ శాన్తుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 62 ॥
స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసమ్బుతోఁ
బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కలాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్
బాత్రం బఞ్చు భజిమ్పఁబోదు రితియున్ భాష్యమ్బె యివ్వారిచా
రిత్రం బెన్నఁడు మెచ్చ నెఞ్చ మదిలో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 63 ॥
అకలఙ్కస్థితి నిల్పి నాడ మను ఘణ్టా(ఆ)రావమున్ బిన్దుదీ
పకలాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానన్దతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారిఞ్చువా
రికిఁగా వీడు భవోగ్రబన్ధలతికల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 64 ॥
ఒకయర్ధమ్బు నిన్ను నే నడుగఁగా నూహిఞ్చి నెట్లైనఁ బొ
మ్ము కవిత్వమ్బులు నాకుఁ జెన్దనివి యేమో యణ్టివా నాదుజి
హ్వకు నైసర్గిక కృత్య మిన్తియ సుమీ ప్రార్ధిఞ్చుటే కాదు కో
రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 65 ॥
శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటఞ్చున్సము
త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖమ్బు సిద్ధిఞ్చుఁ; గ
ర్మకలాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రమ్బు ల్విలోకిఞ్చువా
రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 66 ॥
ఒకరిం జమ్పి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహిన్తురే
లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సమ్పదల్ పుత్రమి
త్రకలత్రాదులతోడ నిత్య సుఖమన్దం గన్దురో యున్నవా
రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 67 ॥
నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయమ్బుల జొరం
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజిమ్పఁ డిలనేకష్టప్రకారమ్బులన్
జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 68 ॥
జ్ఞాతుల్ ద్రోహమ్బు వాణ్డ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
మాతణ్డ్రాన సహిమ్పరాదు ప్రతికర్మమ్బిఞ్చుకే జేయగాఁ
బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా
చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 69 ॥
చదువుల్ నేర్చిన పణ్డితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవలప్పి వర్తిమ్పఁగా
మదనక్రోధకిరాతులన్దుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
జెదరుం జిత్తము చిత్తగిమ్పఁగదవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 70 ॥
రోసిం దేణ్టిది రోఁత దేణ్టిది మనొ రోగస్థుణ్డై దేహి తాఁ
బూసిన్దేణ్టిది పూఁత లేణ్టివి మదా(అ)పూతమ్బు లీ దేహముల్
మూసిన్దేణ్టిది మూఁతలేణ్టివి సదామూఢత్వమే కాని తాఁ
జేసిన్దేణ్టిది చేన్తలేఁటివి వృధా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 71 ॥
శ్రీ శైలేశు భజిన్తునో యభవుఙ్గాఞ్చీ నాధు సేవిన్తునో
కాశీవల్లభుఁ గొల్వమ్బోదునొ మహా కాలేశుఁ బూజిన్తునో
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షిమ్పవే నీ కృపా
శ్రీ శృఙ్గారవిలాసహాసములచే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 72 ॥
అయవారై చరియిమ్పవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధమ్బులన్
దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిన్దిఞ్చి నిన్నాత్మని
ష్క్రియతం గానఁగరాదు పణ్డితులకున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 73 ॥
మాయా(అ) జాణ్డకరణ్డకోటిఁ బొడిగామర్ధిఞ్చిరో విక్రమా(అ)
జేయుం గాయజుఁ జమ్పిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దయభుజఙ్గమృత్యువు ననాయాసమ్బునన్ గెల్చిరో
శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 74 ॥
చవిగాఁ జూడ వినఙ్గ మూర్కొనఁ దనూసఙ్ఘర్షణాస్వాదమొం
ద వినిర్మిఞ్చెద వేల జన్తువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారమ్బలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
చ్చి వినోదిమ్పఁగ దీన నేమి ఫలమో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 75 ॥
వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావిమ్పఙ్గ రోఁతయ్యెడున్
వెనుకన్ మున్దట వచ్చు దుర్మరణముల్ వీక్షిమ్ప భీతయ్యెడున్
నను నేఁజూడగ నావిధులలఞ్చియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుఞ్జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 76 ॥
పరిశీలిఞ్చితి మన్త్రతన్త్రములు చెప్ప న్విణ్టి సాఙ్ఖ్యాదియో
గ రహస్యమ్బులు వేద శాస్త్రములు వక్కాణిఞ్చితిన్ శఙ్కవో
దరయం గుమ్మడికాయలోని యవగిఞ్జన్తైన నమ్మిచ్ఞ్చి సు
స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 77 ॥
మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలమ్బుగాఁ జేసి దు
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవమ్బు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీఁదు దలఞ్చిచూడ కధముల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 78 ॥
కాసన్తైన సుఖం బొనర్చునొ మనఃకామమ్బు లీడేర్చునో
వీసమ్బైనను వెణ్టవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావిఞ్చునో
దోసమ్బు ల్బెడఁ బొపునో వలసినన్దోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 79 ॥
ఒకపూఁటిఞ్చుక కూడ తక్కువగునే నోర్వఙ్గలేఁ డెణ్డకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుమ్పట్లెత్తుకోఁజూచు వా
నకు నిణ్డిణ్డ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యమ్బు రో
సి కడాసిమ్పరుగాక మర్త్వులకట శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 80 ॥
కేదారాదిసమస్తతీర్ధములు కోర్మిఞ్జూడఁ బోనేఁటికిన్
గాడా ముఙ్గిలి వారణాసి! కడుపే కైలాసశైలమ్బు మీ
పాదధ్యానము సమ్భవిఞ్చునపుడే భావిమ్ప నజ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 81 ॥
తమకొం బొప్పఁ బరాఙ్గనాజనపర ద్రవ్యమ్బులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొఙ్గం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగిమఞ్చి నీదుచరణ స్తమ్భఞ్జునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 82 ॥
వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులఞ్జేయ నే
లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు
ద్బాధాదుల్ గలిగిమ్పనేల యది కృత్యమ్బైన దుర్మార్గులం
జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 83 ॥
పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజిఞ్చి పుణ్యమ్బునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదమ్బులం
గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిల్లునుం బేట్టుచుం
జెడి యెన్దుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 84 ॥
విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశమ్బు రక్షామ్బువుల్
మత్తత్వమ్బు తదఙ్కురం ఐనృతముల్ మాఱాకు లత్యన్తదు
ద్వృత్తుల్ పువ్వులుఁ బణ్డ్లు మన్మధముఖా విర్భూతదోషమ్బులుం
జిత్తాధ్యున్నతనిమ్బభూజమునకున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 85 ॥
నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠమ్మొనరిన్తునన్న యతఁడున్ మఞ్జుప్రబన్ధమ్బు ని
ష్టాపూర్తిం బఠియిఞ్చుచున్న యతఁడున్ సద్బాన్ధవుల్ గాక చీ
చీ! పృష్ఠాగతబాన్ధవమ్బు నిజమా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 86 ॥
సమ్పద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జఙ్కిఞ్చి యాకాఙ్క్షలన్
దమ్పుల్వెట్టి కలఙ్కము ల్నఱకి బన్ధక్లేశదోషమ్బులం
జిమ్పుల్సేసి వయోవిలాసములు సఙ్క్షేపిఞ్చి భూతమ్బులం
జెమ్పల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 87 ॥
రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఙ్గా సౌఖ్యమో
యీ జన్మమ్బు తరిమ్పఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవిఞ్చు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాన్ధబుద్ధు లగుచున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 88 ॥
నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యమ్బు జావఙ్గ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాన్తిన్ విసర్జిమ్పలే
కున్నా రెన్నఁడు నిన్ను గణ్డు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 89 ॥
నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతమ్బు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కణ్ఠహారమ్బు మేల్
నిన్నీలాగున నుణ్టయుం దెలిసియున్ నీపాదపద్మమ్బు చే
ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 90 ॥
ద్వారద్వారములన్దుఁ జఞ్చుకిజనవ్రాతమ్బు దణ్డమ్ములన్
దోరన్త్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల
క్ష్మీరాజ్యమ్బును గోరి నీమరిజనుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 91 ॥
ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయున్దం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
పూరం బేరులఁ బాఱదో తపసులమ్బ్రోవఙ్గ నీవోపవో
చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 92 ॥
దయ జూడుణ్డని గొన్దఱాడుదురు నిత్యమ్బున్ నినుం గొల్చుచున్
నియమం బెన్తో ఫలమ్బు నన్తియెకదా నీవీయ పిణ్డెన్తో అం
తియకా నిప్పటియుం దలమ్పనను బుద్ధిం జూడ; నేలబ్బుని
ష్క్రియతన్ నిన్ను భజిమ్ప కిష్టసుఖముల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 93 ॥
ఆరావం బుదయిఞ్చెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోఙ్కారాభిధానమ్బు చె
న్నారున్ విశ్వ మనఙ్గఁ దన్మహిమచే నానాదబిన్దుల్ సుఖ
శ్రీ రఞ్జిల్లఁ గడఙ్గు నీవదె సుమీ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 94 ॥
నీభక్తు ల్మదివేల భఙ్గుల నినున్సేవిమ్బుచున్ వేడఁగా
లోభమ్బేటికి వారి కోర్కులు కృపలుత్వమ్బునం దీర్మరా
దా భవ్యమ్బుఁ దలఞ్చి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాణ్డరములోఁ గొఱన్తపడునా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 95 ॥
మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షమ్బు నేఁ డేమయా
'ముదియఙ్గా ముదియఙ్గఁ బుట్టు ఘనమౌ మోహమ్బు లోభమ్బు' న
న్నది సత్యమ్బు కృపం దలమ్ప నొకవుణ్యాత్ముణ్డు నిన్నాత్మ గొ
ల్చి దినమ్బున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 96 ॥
కాలద్వారకవాటబన్ధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యలవ్యాలవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రమ్బు ది
క్చేలాలఙ్కృత! నీదునామ మరయన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 97 ॥
పదివేలలైనను లోకకణ్టకులచేఁ బ్రాప్రిఞ్చు సౌఖ్యమ్బు నా
మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా
నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ
చి దినమ్బున్ ముదమొన్దుదున్ గడపటన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 98 ॥
తాతల్ తల్లియుఁ దణ్డ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో
భీతిం బొన్దఁగనేల చావునకుఁగాఁ బెణ్డ్లాముబిడ్డల్ హిత
వ్రాతమ్బున్ బలవిమ్ప జన్తువులకున్ వాలాయమైయుణ్డఙ్గాఁ
జేతోవీధి నరుణ్డు నిన్గొలువఁడో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 99 ॥
జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సన్ధిఞ్చు టన్యాయవి
ఖ్యాతిం బొన్దుట కొణ్డెకాఁడవుట హింసారమ్భకుణ్డౌట మి
ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యమ్బునాశిఞ్చి యీ
శ్రీ తా నెన్నియుగమ్బు లుణ్డఁగలదో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 100 ॥
చెడుగుల్ కొన్దఱు కూడి చేయఙ్గమ్బనుల్ చీకట్లు దూఱఙ్గఁ మా
ల్పడితిం గాన గ్రహిమ్పరాని నిను నొల్లఞ్జాలఁ బొమ్మఞ్చు నిల్
వెలన్ద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో
రెడి యర్ధమ్బులు నాకు నేల యిడవో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 101 ॥
భసితోద్ధూలనధూసరాఙ్గులు జటాభారోత్తమాఙ్గుల్ తపో
వ్యసనముల్ సాధితపఞ్చవర్ణరసముల్ వైరాగ్యవన్తుల్ నితాం
తసుఖస్వాన్తులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 102 ॥
జలజశ్రీ గల మఞ్చినీల్లు గలవాచత్రాతిలో బాపురే!
వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా!
నలి నా రెణ్డు గుణమ్బు లెఞ్చి మదిలో నన్నేమి రోయఙ్గ నీ
చెలువమ్బైన గుణమ్బు లెఞ్చుకొనవే శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 103 ॥
గడియల్ రెణ్టికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయమ్బు లీభూమిపైఁ
బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటిమ్ప రీ మానవుల్
చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 104 ॥
క్షితిలో దొడ్డతురఙ్గసామజము లేచిత్రమ్ము లాన్దోలికా
తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చిఞ్చుచో
జితపఙ్కేరుహపాదపద్మయుగలా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 105 ॥
సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌలి ని
శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ
నిల గఙ్గాజలచన్ద్రఖణ్డముల దానిన్దుం దుదిం గాఞ్చు నీ
చెలువం బన్తయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 106 ॥
తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనమ్బూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 107 ॥
పటవద్రజ్జుభుజఙ్గవద్రజతవి భ్రాన్తిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చన్ద్రశిలాజపాకుసుమరు క్సాఙ్గత్యవత్తఞ్చువా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవిమ్పన్ లేక దుర్మేధనుల్
చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 108 ॥
నిను నిన్దిఞ్చిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసిమ్పవో
చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం
బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదమ్బు గానఙ్గ వ
చ్చెనొ లేకుణ్డిన నూఱకుణ్డగలవా శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 109 ॥
కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తమ్బు గాదో రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గమ్బు చల్లాఱెనో
పరనిన్దాపరులన్ వధిమ్ప విదియున్ భాష్యమ్బె వారేమి చే
సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 110 ॥
దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొఙ్గర్మమున్ వైద్యమున్
నరనాధాశ్రయ మోడబేరమును బెన్మన్త్రమ్బు సిద్ధిఞ్చినన్
అరయన్ దొడ్డఫలమ్బు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 111 ॥
తనయుం గాఞ్చి ధనమ్బు నిఞ్చి దివిజస్థానమ్బు గట్టిఞ్చి వి
ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుణ్డై తటాకమ్బు నే
ర్పునఁ ద్రవ్విఞ్చి వనమ్బు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే
సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 112 ॥
క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా
నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
ప్రతిభ ల్మఞ్చిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటఞ్చు రధముల్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 113 ॥
నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనఞ్చు మీదెత్తితిన్
జేకొణ్టిన్ బిరుదమ్బు కఙ్కణము ముఞ్జేఁ గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతమ్బు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలమ్బులరీతి దప్పెడు జుమీ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 114 ॥
నిచ్చల్ నిన్ను భజిఞ్చి చిన్మయమహా నిర్వాణపీఠమ్బు పై
రచ్చల్సేయక యార్జవమ్బు కుజన వ్రాతమ్బుచేఁ గ్రాఙ్గి భూ
భృచ్చణ్డాలురఁ గొల్చి వారు దనుఁ గోపిమ్మన్ బుధుం డార్తుఁడై
చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 115 ॥
దన్తమ్బు ల్పడనప్పుడే తనువునన్దారూఢి యున్నప్పుడే
కాన్తాసఙ్ఘము రోయనప్పుడే జరక్రాన్తమ్బు గానప్పుడే
విన్తల్మేన జరిఞ్చనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చిన్తిమ్పన్వలె నీపదామ్బుజములన్ శ్రీ కాలహస్తీశ్వరా! ॥ 116 ॥

Explore More