Lord Rama

పాహి రామప్రభో

(Pahi Ramaprabho in Telugu)

Bhadrachala Ramadasa

Pahi Ramaprabho is a soul-stirring Kirtana composed by the legendary devotee Bhadrachala Ramadasa, also known as Kancharla Gopanna. Dedicated to the Lord of Bhadrachalam, this composition exemplifies the profound surrender and unconditional love of a true Bhakta. Through its rhythmic structure and evocative lyrics, the devotee pleads for the protection and grace of Lord Rama, the consort of Sita. Chanting this stotra is believed to dissolve the ego, cultivate deep inner devotion, and grant the seeker spiritual solace, mental clarity, and the compassionate guidance of the Supreme Lord in navigating the challenges of life.

రాగమ్: మధ్యమావతి

తాలమ్: ఝమ్ప
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥
శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణిన్తు రామప్రభో ॥ 1 ॥
పాహిరామప్రభో ॥
సున్దరాకార హృన్మన్దిరోద్ధార సీ
తేన్దిరా సంయుతానన్ద రామప్రభో ॥ 2 ॥
పాహిరామప్రభో ॥
ఇన్దిరా హృదయారవిన్దాదిరూఢ
సున్దారాకార ఆనన్ద రామప్రభో ॥ 3 ॥
పాహిరామప్రభో ॥
ఎన్దునేజూడ మీసున్దరాననము
కన్దునో కన్నులిమ్పొన్ద రామప్రభో ॥ 4 ॥
పాహిరామప్రభో ॥
పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం
భీర్య దాక్షిణ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 5 ॥
పాహిరామప్రభో ॥
కన్దర్పజనక నాయన్దు రఞ్జిల సదా
నన్దుడవై పూజలన్దు రామప్రభో ॥ 6 ॥
పాహిరామప్రభో ॥
ఇమ్పుగా జెవులకు న్విన్దుగా నీకథల్‌
కన్దుగా మిమ్ము సొమ్పొన్ద రామప్రభో ॥ 7 ॥
పాహిరామప్రభో ॥
వన్దనముచేసి మునులన్దరు ఘనులైరి
విన్దవైనట్టి గోవిన్ద రామప్రభో ॥ 8 ॥
పాహిరామప్రభో ॥
బృన్దారకాది సద్బృన్దార్చితావతార
విన్ద ముని సన్దర్శితానన్ద రామప్రభో ॥ 9 ॥
పాహిరామప్రభో ॥
తల్లివినీవె మాతణ్డ్రివినీవె మా
ధాతవునీవె మాభ్రాత రామప్రభో ॥ 10 ॥
పాహిరామప్రభో ॥
పల్లవాధరలైన గొల్లభామలగూడి
యుల్లమలరఙ్గ రఞ్జిల్లు రామప్రభో ॥ 11 ॥
పాహిరామప్రభో ॥
మల్లరఙ్గమ్బునన్దెల్ల మల్లులజీరి
యల్ల కంసుని జమ్పు మల్ల రామప్రభో ॥ 12 ॥
పాహిరామప్రభో ॥
కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ
సల్లాపమున క్రీడసల్పు రామప్రభో ॥ 13 ॥
పాహిరామప్రభో ॥
తమ్ముడును నీవు పార్శ్వమ్ములఞ్జేరి వి
ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో ॥ 14 ॥
పాహిరామప్రభో ॥
క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు
ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో ॥ 15 ॥
పాహిరామప్రభో ॥
రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్‌
నమ్మినానయ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 16 ॥
పాహిరామప్రభో ॥
కణ్టి మీ శఙ్ఖమ్ము కణ్టి మీ చక్రము
కణ్టి మీ పాదముల్గణ్టి రామప్రభో ॥ 17 ॥
పాహిరామప్రభో ॥
విణ్టి మహిమ వెన్నణ్టి తమ్ముడు నీవు
జణ్టరావయ్య నావెణ్ట రామప్రభో ॥ 18 ॥
పాహిరామప్రభో ॥
మేము నీవారమైనాము రక్షిమ్పుమ
న్నాము జాగేల శ్రీరామచన్ద్రప్రభో ॥ 19 ॥
పాహిరామప్రభో ॥
నామనోవీధిని ప్రేమతోనుణ్డు మీ
భూమిజాసహిత జయ రామచన్ద్రప్రభో ॥ 20 ॥
పాహిరామప్రభో ॥
మీ మహత్త్వమ్ము విన మనమన్దు ప్రేమ
వేమరున్‌ బుట్టు శ్రీరామచన్ద్రప్రభో ॥ 21 ॥
పాహిరామప్రభో ॥
శ్యామసున్దర కోమలం జానకీమనః
కాముకం త్వం భజే రామచన్ద్రప్రభో ॥ 22 ॥
పాహిరామప్రభో ॥
కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న
నా మొరాలిఞ్చు నాస్వామి రామప్రభో ॥ 23 ॥
పాహిరామప్రభో ॥
కామితప్రభుడవై ప్రేమతో రక్షిఞ్చు
స్వామి సాకేతపురి రామచన్ద్రప్రభో ॥ 24 ॥
పాహిరామప్రభో ॥
అన్న రావన్న నీకన్న నామీద నెన
రున్న వారేరి నాయన్న రామప్రభో ॥ 25 ॥
పాహిరామప్రభో ॥
నిన్నెగాకను మరే యన్యులగానన్‌
గన్నతణ్డ్రివిగ మాయన్న రామప్రభో ॥ 26 ॥
పాహిరామప్రభో ॥
వెన్నదొఙ్గిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని
న్నెన్నగా వశమె రావన్న రామప్రభో ॥ 27 ॥
పాహిరామప్రభో ॥
ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక
నిన్నె నెమ్మదిని వర్ణిన్తు రామప్రభో ॥ 28 ॥
పాహిరామప్రభో ॥
ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని
మన్నిఞ్చి దయచేయుమన్న రామప్రభో ॥ 29 ॥
పాహిరామప్రభో ॥
పన్నగాధిపశాయి భావనాతీత ఆ
పన్న నామనవి వినవన్న రామప్రభో ॥ 30 ॥
పాహిరామప్రభో ॥
మేటివాక్యమ్బు మీసాటిదైవమ్బు ము
మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో ॥ 31 ॥
పాహిరామప్రభో ॥
పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున
వేడుచున్నాను గాపాడు రామప్రభో ॥ 32 ॥
పాహిరామప్రభో ॥
వేడుకోగానె నీజోడుకాడును నీవు
కూడి రారయ్య నాతోడ రామప్రభో ॥ 33 ॥
పాహిరామప్రభో ॥
నేడు నాకోర్కె లీడేరగాజేసి కా
పాడరా కరినేలు జాడ రామప్రభో ॥ 34 ॥
పాహిరామప్రభో ॥
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొన్దు
వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో ॥ 35 ॥
పాహిరామప్రభో ॥
చూడు మీభక్తులను గూడు మీరిపుల గో
రాడు మీవల్ల గోవిన్ద రామప్రభో ॥ 36 ॥
పాహిరామప్రభో ॥
పుణ్డరీకాక్ష మార్తాణ్డవంశోద్భవా
ఖణ్డలస్తుత్య కోదణ్డ రామప్రభో ॥ 37 ॥
పాహిరామప్రభో ॥
కుణ్డలిశయన భూమణ్డలోద్ధరణ పా
షణ్డజనహరణ కోదణ్డరామప్రభో ॥ 38 ॥
పాహిరామప్రభో ॥
నిణ్డుదయతోడ నాయణ్డ బాయకను నీ
వుణ్డి గాపాడు కోదణ్డరామప్రభో ॥ 39 ॥
పాహిరామప్రభో ॥
జాతకౌతూహలం చక్షుకృత్యారమాం
పూతసీతాపతే దాత రామప్రభో ॥ 40 ॥
పాహిరామప్రభో ॥
పాతకులలో మొదటి పాతకుడ నావణ్టి
పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో ॥ 41 ॥
పాహిరామప్రభో ॥
భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖణ్డిఞ్చి
సీతగైకొన్న విఖ్యాత రామప్రభో ॥ 42 ॥
పాహిరామప్రభో ॥
పూతనాకల్మషోద్ధూత పె\న్‌శత్రు సం
హారి శ్రీసీతాసమేత రామప్రభో ॥ 43 ॥
పాహిరామప్రభో ॥
జాతినీతులులేక భూతలమ్బున దిరుగు
ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో ॥ 44 ॥
పాహిరామప్రభో ॥
ఎప్పుడును గణ్టికి రెప్పవలె గాచి న
న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో ॥ 45 ॥
పాహిరామప్రభో ॥
ఏదయా నీదయా యోదయామ్భోనిధీ
యాదిలేదయ్య నామీద రామప్రభో ॥ 46 ॥
పాహిరామప్రభో ॥
ఘోరరాక్షస గర్వహార విశ్వమ్భరో
ద్ధార గుణసాన్ద్రవిస్తార రామప్రభో ॥ 47 ॥
పాహిరామప్రభో ॥
మోదమున నీవు నన్నాదుకోవయ్య గో
దావరీ తీర భద్రాద్రి రామప్రభో ॥ 48 ॥
పాహిరామప్రభో ॥
నీదు బాణమ్బులను నాదుశత్రులబట్టి
బాధిమ్పకున్నావదేమి రామప్రభో ॥ 49 ॥
పాహిరామప్రభో ॥
ఆదిమధ్యాన్త బహిరాన్తరాత్ముడవనుచు
వాదిన్తునే జగన్నాథ రామప్రభో ॥ 50 ॥
పాహిరామప్రభో ॥
చాలదేమి పదాబ్జములసాటి యీపదు
నాల్గులోకమ్బుల గూడి రామప్రభో ॥ 51 ॥
పాహిరామప్రభో ॥
ఏల యీలాగు జాగేల జేసెదవు మ
మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో ॥ 52 ॥
పాహిరామప్రభో ॥
పాలువెన్నలు మ్రుచ్చిలిన్తివని యశోద
రోటగట్టిన మాయచాలు రామప్రభో ॥ 53 ॥
పాహిరామప్రభో ॥
కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో
నల్లబిల్లిగను రఞ్జిల్ల రామప్రభో ॥ 54 ॥
పాహిరామప్రభో ॥
వాలి నొక్కమ్మునన్‌ గూలవేసిన శౌర్య
శాలియౌ నినుదలతు జాల రామప్రభో ॥ 55 ॥
పాహిరామప్రభో ॥
సాలభఞ్జికల నిర్మూలమ్బు చేయగా
జాలితివి గోపాలబాల రామప్రభో ॥ 56 ॥
పాహిరామప్రభో ॥
తాలవృక్షము లొక్కకోల ధరగూలగా
లీలనేసిన బాహుశాలి రామప్రభో ॥ 57 ॥
పాహిరామప్రభో ॥
(శిలయైన యహల్య శ్రీపాదములు
సోక నెలతయై మిము మదితలచె ॥ 58 ॥
పాహిరామప్రభో ॥)
వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్‌
గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో ॥ 59 ॥
పాహిరామప్రభో ॥
దానధర్మమ్బులున్‌ దపజపమ్బులు నీదు
నామకీర్తనకు సరిరావు రామప్రభో ॥ 60 ॥
పాహిరామప్రభో ॥
మానావమానములు మహిని నీవై యుణ్డ
మాకేల మదిని ఈచిన్త రామప్రభో ॥ 61 ॥
పాహిరామప్రభో ॥
జ్ఞానయోగాభ్యాసమన్దు నుణ్డెడివారి
కానన్దమయుడవైనావు రామప్రభో ॥ 62 ॥
పాహిరామప్రభో ॥
భానువంశమునన్దు మానవాధిపుడవై
దానవుల బరిమార్చినావు రామప్రభో ॥ 63 ॥
పాహిరామప్రభో ॥
అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా
మనవి విను దేవకీతనయ రామప్రభో ॥ 64 ॥
పాహిరామప్రభో ॥
మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స
న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో ॥ 65 ॥
పాహిరామప్రభో ॥
నిత్యమై సత్యమై నిర్మలమ్బై మహిని
దివ్యవంశోత్తంసమైన రామప్రభో ॥ 66 ॥
పాహిరామప్రభో ॥
సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన
శ్రావ్యమై యుణ్డునో దివ్య రామప్రభో ॥ 67 ॥
పాహిరామప్రభో ॥
గట్టిగా నీవున\న్‌ పట్టుగా విహితమౌ
నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో ॥ 68 ॥
పాహిరామప్రభో ॥
దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి
పట్టి యాగము గాచినట్టి రామప్రభో ॥ 69 ॥
పాహిరామప్రభో ॥
చుట్టుకొని కాలిఙ్గు డట్టహాసముచేయ
పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో ॥ 70 ॥
పాహిరామప్రభో ॥
సన్తతము నన్ను రక్షిన్తువని నమ్మి మి
మ్మెన్తురా జానకీకాన్త రామప్రభో ॥ 71 ॥
పాహిరామప్రభో ॥
పన్తమున మీ పాదచిన్తనము చేయ నా
వన్తలన్నియు మానుటెన్త రామప్రభో ॥ 72 ॥
పాహిరామప్రభో ॥
విన్తగాదయ్య నేనిన్తనాడినది నా
పన్తమున మిమ్ము భావిన్తు రామప్రభో ॥ 73 ॥
పాహిరామప్రభో ॥
శాన్తమూర్తిని రమాకాన్తుడవని చాల
సన్తసమ్బున నిన్ను నెన్తు రామప్రభో ॥ 74 ॥
పాహిరామప్రభో ॥
అక్షయమ్బైన నీకుక్షిలో లోకముల
రక్షిఞ్చితివి లక్ష్మీవక్ష రామప్రభో ॥ 75 ॥
పాహిరామప్రభో ॥
దన్తివత్సల భక్తచిన్తామణీ విశ్వ
మన్తయును నీవు రక్షిఞ్చు రామప్రభో ॥ 76 ॥
పాహిరామప్రభో ॥
పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను
రక్షిఞ్చు మోక్షప్రదాత రామప్రభో ॥ 77 ॥
పాహిరామప్రభో ॥
రక్షిఞ్చి సజ్జనుల వీక్షిఞ్చి దుర్జనుల
రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో ॥ 78 ॥
పాహిరామప్రభో ॥
రక్షకుడవై జగద్రక్షణముచేయగా
రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో ॥ 79 ॥
పాహిరామప్రభో ॥
లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా
కక్షయమ్బుగ కటాక్షిఞ్చు రామప్రభో ॥ 80 ॥
పాహిరామప్రభో ॥
రావయా అభయమ్బు లీవయా నాస్వామీ
నీవయా గతి దేవరాయ రామప్రభో ॥ 81 ॥
పాహిరామప్రభో ॥
కావు కావుమటఞ్చు కాకాసురుడురాగ
కాచి రక్షిఞ్చినావయ్య రామప్రభో ॥ 82 ॥
పాహిరామప్రభో ॥
దేవదేవోత్తమా దేవేన్ద్రసన్నుతా
కావవేనన్ను శ్రీరామచన్ద్రప్రభో ॥ 83 ॥
పాహిరామప్రభో ॥
భావజజనక నా బాధలన్నియుమాన్పి
యే విధమ్బునైన నేలు రామప్రభో ॥ 84 ॥
పాహిరామప్రభో ॥
శ్రీవైష్ణవులపాలి చిన్తామణివి చాల
సేవగైకొని కరుణచేయు రామప్రభో ॥ 85 ॥
పాహిరామప్రభో ॥
భావమున మిముభక్తి సేవిఞ్చు జనులకు
కైవల్యమొసగు శ్రీరామచన్ద్రప్రభో ॥ 86 ॥
పాహిరామప్రభో ॥
గోపాలురను గూడి యావులను మేపి
ఆపదోద్ధారకుడవైన రామప్రభో ॥ 87 ॥
పాహిరామప్రభో ॥
నాపాలి శ్రీరామ భూపాలకా నను
కాపాడరావ గోపాల రామప్రభో ॥ 88 ॥
పాహిరామప్రభో ॥
సారమౌశౌర్య విస్తారమౌ సున్దరా
కారసద్భక్తమన్దార రామప్రభో ॥ 89 ॥
పాహిరామప్రభో ॥
శరణాగతత్రాణ బిరుదాఙ్కితమ్బైన
వరము నాకొసగు యేమరక రామప్రభో ॥ 90 ॥
పాహిరామప్రభో ॥
శ్రీరామ రామేతి శ్రేష్ఠమన్త్రము సారె
సారెకును విన్తగా జదువ రామప్రభో ॥ 91 ॥
పాహిరామప్రభో ॥
శ్రీరామ నీనామ చిన్తనామృతపాన
సారమే నాదుమది గోరు రామప్రభో ॥ 92 ॥
పాహిరామప్రభో ॥
చేరి మీపాద పద్మారాధనము చేయ
కోరినానయ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 93 ॥
పాహిరామప్రభో ॥
ఘోరరాక్షసగర్వహారి విశ్వమ్భరా
భూరిగుణసాన్ద్ర విస్తార రామప్రభో ॥ 94 ॥
పాహిరామప్రభో ॥
మారీచమాయానివార శరసన్ధాన
ధారుణీతనయా విహార రామప్రభో ॥ 95 ॥
పాహిరామప్రభో ॥
పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న
న్నరసి పోషిమ్పగదవయ్య రామప్రభో ॥ 96 ॥
పాహిరామప్రభో ॥
పరధనమ్బును పరస్త్రీల నపేక్షిఞ్చు
నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో ॥ 97 ॥
పాహిరామప్రభో ॥
కామాదిదుర్గుణ స్తోమమ్బులడగ మీ
నామామృతమె దిక్కు రామచన్ద్రప్రభో ॥ 98 ॥
పాహిరామప్రభో ॥
దుష్టులగు దానవుల నష్టమ్బుగా జేయగా
బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో ॥ 99 ॥
పాహిరామప్రభో ॥
కష్టపడలేనయ్య పట్టాభిరామ నా
కిష్టసమ్పదలిచ్చి యేలు రామప్రభో ॥ 100 ॥
పాహిరామప్రభో ॥
కేశవాయనిన భవపాశములొలగు స
ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో ॥ 101 ॥
పాహిరామప్రభో ॥
నారాయణా నీదు నామామృతం బెపుడు
పారాయణము చేతు నేను రామప్రభో ॥ 102 ॥
పాహిరామప్రభో ॥
మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు
సాధుసజ్జనదయామ్భోధి రామప్రభో ॥ 103 ॥
పాహిరామప్రభో ॥
గోవిన్ద గోవిన్ద గోపాలకృష్ణయని
గోపకులు గొనియాడు గోపరామప్రభో ॥ 104 ॥
పాహిరామప్రభో ॥
విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ
యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో ॥ 105 ॥
పాహిరామప్రభో ॥
శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం
గాధర స్తోత్ర యానన్ద రామప్రభో ॥ 106 ॥
పాహిరామప్రభో ॥
మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుఞ్చి
తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో ॥ 107 ॥
పాహిరామప్రభో ॥
కూర్మరూపము నొన్ది కొణ్డమూపునదాల్చి
కూర్మితో నమృతమ్బుగూర్చి రామప్రభో ॥ 108 ॥
పాహిరామప్రభో ॥
వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి
సురల రక్షిఞ్చు దాశరథి రామప్రభో ॥ 109 ॥
పాహిరామప్రభో ॥
శరణన్న ప్రహ్లాదు గరుణిఞ్చి రక్షిమ్ప
నరసింహమూర్తివైనట్టి రామప్రభో ॥ 110 ॥
పాహిరామప్రభో ॥
వామనత్వమున భూదానమడిగియు బలిని
భూమిక్రిన్దనడఞ్చి పొల్చు రామప్రభో ॥ 111 ॥
పాహిరామప్రభో ॥
పరశురాముడనఙ్గ నరపాలకులనెల్ల
నరసిపొరికొన్న దాశరథి రామప్రభో ॥ 112 ॥
పాహిరామప్రభో ॥
శ్రీరామమూర్తివై యారావణుని తలల్‌
ధారుణిన్‌ పడగూర్చినావు రామప్రభో ॥ 113 ॥
పాహిరామప్రభో ॥
హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల
బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో ॥ 114 ॥
పాహిరామప్రభో ॥
సిద్ధసన్నుత మనోబద్ధుణ్డవై నీవు
బౌద్ధుణ్డవైతి ప్రబుద్ధ రామప్రభో ॥ 115 ॥
పాహిరామప్రభో ॥
కలికిరూపముదాల్చి కలియుగమ్బున నీవు
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో ॥ 116 ॥
పాహిరామప్రభో ॥
అవ్యయుడవైన నీయవతారముల జూచి
దివ్యులైనారు మునులయ్య రామప్రభో ॥ 117 ॥
పాహిరామప్రభో ॥
శ్రీరామనామమే వేలస్మరియిన్తు
స్వామి దయచేయు సమ్పదను రామప్రభో ॥ 118 ॥
పాహిరామప్రభో ॥
అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ
నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో ॥ 119 ॥
పాహిరామప్రభో ॥
తెప్పరమ్బులుదీర్చి యిప్పుడేమరక నన్‌
ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో ॥ 120 ॥
పాహిరామప్రభో ॥
పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల
పాలిమ్పుమా భద్రశైలి రామప్రభో ॥ 121 ॥
పాహిరామప్రభో ॥
పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని
కష్టపెట్టకను చేపట్టు రామప్రభో ॥ 122 ॥
పాహిరామప్రభో ॥

Explore More