Lord Rama

రామచన్ద్రాయ జనక (మఙ్గలం)

(Ramachandraya Janakarajaja Manoharaya Mangalam in Telugu)

Traditional

This exquisite stotra is a devotional hymn dedicated to Lord Rama, celebrating his divine attributes and his union with Goddess Sita, the daughter of King Janaka. The verses invoke auspiciousness, or mangalam, upon the Lord, highlighting his benevolent nature as a protector of his devotees and a granter of righteous wishes. Reciting this hymn is believed to purify the mind, foster deep devotion, and invite divine grace into one's life. It serves as a rhythmic meditation on the majesty and compassion of Sri Rama, offering peace, prosperity, and spiritual upliftment to those who chant it with sincerity.

రామచన్ద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మఙ్గలమ్ ॥
కోసలేశాయ మన్దహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మఙ్గలమ్ ॥ 1 ॥
చారు కుఙ్కుమో పేత చన్దనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మఙ్గలమ్ ॥ 2 ॥
లలిత రత్నకుణ్డలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మఙ్గలమ్ ॥ 3 ॥
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మఙ్గలమ్ ॥ 4 ॥
పుణ్డరీకాక్షాయ పూర్ణచన్ద్రాననాయ
అణ్డజాతవాహనాయ అతుల మఙ్గలమ్ ॥ 5 ॥
విమలరూపాయ వివిధ వేదాన్తవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మఙ్గలమ్ ॥ 6 ॥
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ [కమల వాసాయ]
స్వామి భద్రగిరివరాయ సర్వ మఙ్గలమ్ ॥ 7 ॥

Explore More